టెర్రరిస్ట్ ని పట్టించిన డాక్టర్ కు 33 ఏళ్ల శిక్ష! ఇప్పటికీ జైలులోనే...
Sun Jun 08, 2025 17:12 Others.202506088680.jpg)
అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ ప్రధాన నేత ఒసామా బిన్ లాడెన్‌ను చంపేందుకు అమెరికా సీఐఏకి కీలక సమాచారం అందించిన పాకిస్థానీ వైద్యుడు డాక్టర్ షకీల్ అఫ్రీదీ ప్రస్తుతం పాకిస్థాన్ కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనను తక్షణమే విడుదల చేయాలంటూ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు బ్రాడ్ షెర్మన్ చేసిన డిమాండ్‌కు పూర్తిగా మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం శశి థరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష కమిటీ అమెరికా పర్యటనలో భాగంగా పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ గురించి వివరిస్తోంది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో డాక్టర్ అఫ్రీదీ అరెస్టును ప్రస్తావించిన బ్రాడ్ షెర్మన్ వ్యాఖ్యలపై థరూర్ స్పందించారు.
ఇది కూడా చదవండి: పెట్రోల్ తలపై పోసుకుంటున్న యువకులు! మణిపూర్ లో మళ్లీ ఎందుకీ ఉద్రిక్తతలు?
థరూర్ ప్రకారం, డాక్టర్ అఫ్రీదీ పాక్‌కు చెందినవాడే అయినా, ఉగ్రవాదాన్ని అరికట్టడంలో సహాయపడినందుకు అతడిని మన్నించాల్సిందిగా చెప్పారు. బిన్ లాడెన్‌ను తేల్చిచెప్పిన సమాచారం ఇచ్చినందుకు ఓ వైద్యుడిని అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేయడం దారుణమని ఆయన పేర్కొన్నారు. 2011లో అబొట్టాబాద్‌లో జరిగిన అమెరికా దాడికి ముందు, అఫ్రీదీ డీఎన్ఏ నమూనాలు సేకరించేందుకు నకిలీ పోలియో టీకా కార్యక్రమంలో భాగస్వామిగా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ సమాచారం ఆధారంగా ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చిన తర్వాత పాకిస్థాన్ ప్రభుత్వం అఫ్రీదీపై దేశద్రోహం కేసు నమోదు చేసి, 33 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఆయన విడుదలకు అమెరికా పలు మార్లు డిమాండ్ చేసినా, పాకిస్థాన్ ఒప్పుకోవడం లేదు. తాజగా శశి థరూర్ ఈ డిమాండ్‌కు మద్దతు ఇవ్వడం గమనార్హం.
ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆ నీచులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు.. ఒక్కొక్కరికి ఊచకోతే! మహిళలపై అనుచిత వ్యాఖ్యలు!
మహిళలను కించపరిస్తే సహించం - క్షమాపణలు చెప్పాలి.! లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!
రైతులకు శుభవార్త! తక్కువ వడ్డీతో రూ.3 లక్షల లోన్!
ఏపీకి వస్తోన్న గూగుల్.. అక్కడ 143 ఎకరాల్లో ఏర్పాటు.. ఆ ప్రాంతానికి మహర్దశ!
ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!
సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!
ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!
అన్నదాత సుఖీభవ ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే?
ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!
ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!
తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #ShakilAfridi #OsamaBinLaden #CIAOperation #JusticeForAfridi #ShashiTharoor #PakistanPolitics #WarOnTerror #BinLadenRaid
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.